సినిమా వార్తలు

తిరిగి డైలమాలో సునీల్?


1 year ago తిరిగి డైలమాలో సునీల్?

‘అందాల రాముడు’లో హీరో కాకముందు వరకు సునీల్ తన కామెడీతో తెలుగు ప్రేక్షకులను అమితంగా అలరించారు. అయితే ఆ సినిమాలో హీరో గా చేసినప్పటి నుండి హీరోగా సునీల్ ఫెయిల్ అవుతూనే వచ్చాడు. మొన్న సిల్లీ ఫెలోస్‌లోనూ హీరో చేసాడు. ఇక రీసెంట్ గా త్రివిక్రమ్ డైరెక్షన్ లో సునీల్ అరవింద సమేతలో నీలాంబరి పాత్ర చేశాడు. పాత్ర కథ పరంగా ఎన్టీఆర్ కు ఆశ్రయమిచ్చి, కీలక మలుపుకు దోహదపడేదిగా తీర్చిదిద్దారు. అయితే  త్రివిక్రమ్ తన స్నేహితుడు సునీల్ ను  ఈ పాత్రలో ఏమంత గొప్పగా చూపించలేకపోయారనే టాక్ వినిపిస్తోంది.

ఈ పాత్రలో చాలా నార్మల్ గా కనిపించాడు సునీల్. నిజానికి సునీల్ మంచి వచ్చే కామెడీ టైమింగ్ ను అతని పాత సినిమాలు చూసుకుంటే మనకే అర్ధం అవుతుంది. కమెడియన్ గా రీఎంట్రీ ఇచ్చి అదరకొడతాడు అనుకుంటే నీలాంబరి పాత్ర ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీనిని చూస్తుంటే క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సునీల్ ఎంతో కాలం సెట్ అయ్యేలా కనిపించడం లేదంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగడం అంత ఈజీ కాదనిపిస్తోంది. మరోవైపు సునీల్ ఆలీ తరహాలో ఒక టీవీ షో చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. మరి సునీల్ ఇప్పడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.