సినిమా వార్తలు

తాత లుక్‌లో నేను: సుమంత్‌ ట్వీట్‌


11 months ago తాత లుక్‌లో నేను: సుమంత్‌ ట్వీట్‌
నందమూరి తారక రామారావు జీవితాధారంగా ‘యన్‌టిఆర్’ బయోపిక్‌ నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. అలనాటి నటుడు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఆయన మనుమడు సుమంత్‌ నటిస్తున్నారు. ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు 94వ జయంతి. దీనిని పురస్కరించుకుని సినిమాలోని ఏఎన్నార్‌ లుక్‌ను సుమంత్‌ ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. ‘ఈ రోజు ఏఎన్నార్‌ 94వ జయంతి. పుట్టినరోజు శుభాకాంక్షలు తాత. సినిమాలో ఇది నా లుక్‌’ అంటూ సుమంత్‌ ట్వీట్‌ చేశారు. ఏఎన్నార్‌ పాత్రలో సుమంత్ చక్కగా ఒదిగిపోయారు. అదే తలకట్టు, కళ్లజోడుతో తాతకు తగ్గ మనవడు అని అనిపించుకున్నారు. ఈ సినిమా చిత్రీకరణకు వెళ్లేటప్పుడు సుమంత్‌ తన తాతగారు వాడిన ఆఖరి కారులోనే సెట్స్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటించిన దగ్గుబాటి రానా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది.