సినిమా వార్తలు

28న సుమంత్ ‘ఇదం జగత్’


9 months ago 28న సుమంత్ ‘ఇదం జగత్’

హీరో సుమంత్ ఇటీవల ‘సుబ్రహ్మణ్యపురం’ అనే చిత్రంతో ప్రేక్షకులను అల‌రించారు. ఈ సినిమా మంచి టాక్ ను తెచ్చుకొని పెట్టిన పెట్టుబడి తిరిగివ‌చ్చింది. ఇక ఈ చిత్రం ఇంకా థియేటర్లలో వుండగానే సుమంత్ నటించిన మరో చిత్రం విడుదలకు సిద్ధ‌మైంది. నూతన దర్శకుడు అనిల్ శ్రీకంఠం దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం ‘ఇదం జగత్’. ఈ చిత్రంలో సుమంత్ సరసన అంజు కురియన్ కథానాయిక. ఈ చిత్రం డిసెంబర్ 28న విడుదలకానుంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం స‌మ‌కూర్చిన‌ ఈచిత్రాన్నిజొన్నలగడ్డ పద్మావతీ, గంగపట్నం శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో కూడా సుమంత్ మరో విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.