సినిమా వార్తలు

మహేష్ కోసం సుకుమార్ కొత్త కధ!


10 months ago మహేష్ కోసం సుకుమార్ కొత్త కధ!

ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్, హ్యాండ్సమ్ హీరో మహేష్ కాంబినేషన్ లో మూవీ రాబోతుందని తెలిసిన విషయమే. అయితే సుకుమార్ మహేష్ కి ఒక పీరియడ్ డ్రామా కధ వినిపించగా, మహేష్ దానిని నిరాకరించినట్లు భోగట్టా. అది ఒక పీరియడ్ డ్రామా అవ్వటం వలన, దీనికి పోటీ గా ప్రభాస్ -రాధాకృష్ణ మూవీ మరియు మెగా స్టార్ సైరా కూడా వచ్చే ఏడాది విడుదల కానుండటంతో మహేష్ ఈ కథను ఒప్పుకోలేదని అంటున్నారు. అదీ కాక మహేష్ కు తన లుక్ ను మార్చుకొనే ఉద్దెశం లేదట. పీరియడ్ డ్రామా చేసే నేపధ్యం లో లుక్ ని మార్చటం అనివార్యం అవ్వటం కూడా ఈ కధ ఒప్పోకోకపోవటానికి ఒక కారణం కావచ్చని అంటున్నారు. అందువలన సుకుమార్ ఇప్పుడు మహేష్ కోసం మరో కథను తయారు చేసే పనిలో ఉన్నాడట. దీనికి గాను మహేష్, సుకుమార్ ఇద్దరు తరచు చర్చించుకుంటున్నట్లు తెలిసింది. వీరివురు కలిసి ఒక గట్టి కథను తయారుచేసే పనిలో ఉన్నారు. 

ఇదివరకు వీరి కాంబినేషన్ లో వచ్చిన '1 నేనొక్కడినే' ఆశించిన విధంగా ఫలితాన్ని ఇవ్వని కారణంగా వీరు ఈ కొత్త కధ పై మరింత శ్రద్ధ చూపుతున్నట్లు తెలుస్తోంది.