సినిమా వార్తలు

సుకుమార్ తాజా చిత్ర‌మిదే!


11 months ago సుకుమార్ తాజా చిత్ర‌మిదే!

సుకుమార్. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్‌లలో ఒకరుగా పేరొందారు. ఆయన పెద్ద సినిమాలకు దర్శకత్వం వహించడమే కాదు.. చిన్న సినిమాలను నిర్మిస్తూ బిజీగా మారారు.. ఇటీవల రంగస్థలం చిత్రానికి దర్శకత్వం వహించి.. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు సుకుమార్. అలాగే కుమారి 21 ఎఫ్ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు.

ఆ క్రమంలో ఆయన ఈ సారి కూడా ఓ ప్రేమ కథ చిత్రాన్ని, యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా రూపొందించనున్నారని తెలుస్తోంది. సుకమార్‌ తన దగ్గర పని చేసే అసిస్టెంట్లనే దర్శకులుగా పరిచయం చేస్తూ.. కథ, మాటలు అందిస్తూ.. సినిమాలను నిర్మిస్తూ.. సక్సెస్‌ సాధిస్తున్న విషయం విదిత‌మే. అయితే సుకుమార్ ఈసారి నాగశౌర్య, రష్మిక మందాన్న కాంబినేషన్‌లో ఓ లవ్‌ అండ్‌ ఎంటర్‌టైనర్‌ను నిర్మించనున్నట్లు సోషల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. కాగా దీనిపై ఇంకా స్ప‌ష్ట‌త రావాల్సివుంది.