సినిమా వార్తలు

నిహారికకు హిట్ ఇచ్చే ప్రయత్నంలో సుకుమార్


7 months ago నిహారికకు హిట్ ఇచ్చే ప్రయత్నంలో సుకుమార్

మెగా కాంపౌండ్‌పై త‌న‌కున్న మ‌మ‌కారాన్ని దర్శకుడు సుకుమార్‌ చాటుకుంటూనే ఉన్నారు . ఆర్య‌, ఆర్య 2, రంగ‌స్థ‌లం… ఈ సినిమాలన్నీ మెగా హీరోల‌తో చేసిన‌వే. 100 % ల‌వ్ కూడా మెగా కాంపౌండ్‌ నుంచి వచ్చినదే. ఇప్పుడు వైష్ణ‌వ్ తేజ్‌తో సుకుమార్ ఓ సినిమా చేస్తున్నా. ఆ సినిమా ఈమ‌ధ్యే ప‌ట్టాలెక్కింది. ఈలోగా నిహారిక కోసం సుకుమార్ ఓ క‌థ సిద్థం చేశారు. ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు ద‌ర్శ‌కుడిగా ప‌నిచేస్తారని సమాచారం. క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు… ఇవ‌న్నీ సుకుమార్ అందించ‌నున్నారట. అంతేకాదు.. ఈ సినిమాని నిర్మాణ భాగ‌స్వామిగానూ వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారనే వార్త వినిపిస్తోంది‌. గీతా ఆర్ట్స్‌, అంజ‌నా ప్రొడ‌క్ష‌న్స్ లలో ఓ సంస్థ ఈ సినిమాను నిర్మించ‌నుంది. దానికి సుకుమార్ భాగస్వామిగా ఉంటారన్న‌మాట‌. చూస్తుంటే నిర్మాత‌గా మాత్రం సుకుమార్ య‌మ బిజీ అయిపోతున్నట్లు కనిపిస్తోంది. మున్ముందు సుకుమార్ నుంచి ఇంకెన్ని సినిమాలు రానున్నాయో వేచి చూడాలి.