సినిమా వార్తలు

ప్రభాస్ కోసం సుకుమార్ క‌థ సిద్ధం


11 months ago ప్రభాస్ కోసం సుకుమార్ క‌థ సిద్ధం

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్‌ అల్లు అర్జున్, ఎన్టీఆర్ , చరణ్ ల‌కు సుకుమార్ భారీ హిట్లను అందించాడు. ఈ స్టార్ హీరోలతో ఆయన చేసిన సినిమాలు ఒకదానికి మించి మరొకటి విజయాలను న‌మోదుచేశాయి. ఈ నేపథ్యంలో ఆయన మహేశ్ బాబు కోసం ఒక కథను సిద్ధం చేస్తున్నట్టు స‌మాచారం. ఇంతవరకూ ఆయన చెప్పిన కథల పై మహేశ్ బాబు సంతృప్తిని వ్యక్తం చేయలేదు.

ఈ నేపథ్యంలో సుకుమార్ .. ప్రభాస్ పై కూడా దృష్టి పెట్టినట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. ప్రభాస్ కి ఒక లైన్ వినిపించి ఆయనతో ఓకే అనిపించేసుకుంటే, ఆ తరువాత పూర్తి కథను సిద్ధం చేసుకోవచ్చనే ఆలోచనలో ఆయన వున్నాడని స‌మాచారం.

మహేశ్ .. ప్రభాస్ లలో ముందుగా ఎవరిని ఒప్పించగలిగితే వాళ్లతో సినిమా చేసేసి, ఆ తరువాత సినిమాను మరో హీరోతో చేయాలనే ఉద్దేశంతో సుకుమార్ కసరత్తు చేస్తున్నార‌ని ఫిలింన‌గ‌ర్ టాక్‌. మరి ముందుగా ఏ హీరోతో సినిమాను చేస్తారో వేచిచూడాల్సిందే మ‌రి.