సినిమా వార్తలు

7న సుమంత్‘సుబ్రహ్మణ్యపురం


10 months ago 7న సుమంత్‘సుబ్రహ్మణ్యపురం

సుమంత్ కెరీర్లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘సుబ్రమహ్మణ్యపురం’. రానా దగ్గుబాటి ఈ చిత్రానికి మద్దతునివ్వడం విశేషం‘సుబ్రమహ్మణ్యపురం’చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చాడు.  సినిమా ఆరంభం రానా వాయిస్ ఓవర్‌తోనే మొదలవుతుందట. తర్వాత కూడా కథకు కీలకమైన సన్నివేశాల్లో రానా మాటలు వినిపిస్తాయని సమాచారం. అలాగే ముగింపులోనూ రానా వాయిస్ ఉంటుందట. సంతోష్ జాగర్లమూడి అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రాన్ని బీరం సుధాకర్ రెడ్డి నిర్మించాడు. ఈషా రెబ్బా కథానాయిక. సుమంత్ ఇందులో హేతువాదిగా కనిపించనున్నాడు. సుబ్రహ్మణ్యపురం అనే ఊర్లో జరిగే అనూహ్య ఘటనల గుట్టు విప్పే పాత్రలో అతను నటించాడు. డిసెంబరు 7న ‘సుబ్రహ్మణ్యపురం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.