సినిమా వార్తలు

‘లక్ష్మీస్ వీరగ్రంథం’లో శ్రీరెడ్డి


11 months ago ‘లక్ష్మీస్ వీరగ్రంథం’లో శ్రీరెడ్డి

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదే సమయంలో ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ చిత్రం నిర్మాణం పనులను కూడా దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి వేగవంతం చేస్తున్నారు. తన సినిమాలో ప్రధాన పాత్రను శ్రీరెడ్డి పోషించనున్నట్టు కేతిరెడ్డి ప్రకటించారు. దీనికి కారణం వర్మేనని.. అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ విషయమై శ్రీరెడ్డి చేసిన పోరాటానికి వర్మ అండగా నిలిచారని.. కాబట్టి శ్రీరెడ్డికి ప్రధాన పాత్ర ఇస్తున్నట్టు కేతిరెడ్డి వెల్లడించారు. ఇప్పటికే శ్రీరెడ్డితో చెన్నైలో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. త్వరలోనే ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభానికి కేతిరెడ్డి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.