సినిమా వార్తలు

శ్రీరెడ్డి బ‌యోపిక్ అప్‌డేట్‌


5 months ago శ్రీరెడ్డి బ‌యోపిక్ అప్‌డేట్‌

న‌టి శ్రీరెడ్డి ఇప్పుడు ఏమాత్రం ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. సినిమా ప‌రిశ్ర‌మ‌లో లైంగిక దోపిడీ ఎలా జ‌రుగుతుందో బాహాటంగా చెప్పిన తెలుగ‌మ్మాయి శ్రీరెడ్డి. ఇప్పుడు శ్రీ రెడ్డి క‌థ‌తో ఒక‌ సినిమా తెర‌కెక్కుతోంది. `రెడ్డి డైరీస్` అనే పేరుతో ఈ సినిమాను తీస్తున్నారు.. శ్రీరెడ్డి త‌న పాత్ర‌లో తానే న‌టిస్తోంది. ఆమెతో పాటు మ‌రికొంత‌మంది కొత్త వారిని ఈ సినిమా కోసం తీసుకున్నారు.. శ్రీ రెడ్డి జీవితంలో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని చిత్తిరై సెల్వ‌న్ క‌థ‌ను తీర్చిదిద్దారు.. డాక్ట‌ర్ అలాదీన్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రంగీలా ఫిల్మ్ హౌస్ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. ర‌విదేవ‌న్ నిర్మాత‌. ఏప్రిల్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. సినిమాలో ఎక్కువ భాగాన్ని అలెప్పీ, గోవాలో చిత్రీక‌రించారు. శ్రీరెడ్డి త‌న సొంత అనుభ‌వాల‌తో పాటు, త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి చెప్పుకొన్న పలువురి అనుభ‌వాల‌ను కూడా ఈ సినిమాలో చూపించ‌నున్నార‌ని భోగ‌ట్టా.