సినిమా వార్తలు

హైకోర్టు మెట్లెక్కిన శ్రీరెడ్డి


1 year ago హైకోర్టు మెట్లెక్కిన శ్రీరెడ్డి

సినిమా  ప్రముఖులపై లైంగిక ఆరోపణలు చేసి సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి..తాజాగా హైకోర్టు మెట్లెక్కింది. తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, దీని నివారణకు కమిటీ వేయాలని పిటిషన్ వేసింది. ఆమె పిటిషన్‌పై విచాంచిన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు పంపింది. లైంగిక దోపిడీని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని అభిప్రాయపడింది. సినీ పరిశ్రమలో లైంగిక దోపిడీ అంశంపై అభిప్రాయం తెలపాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అంతర్గత విచారణ కోసం సినీ పరిశ్రమలో కమిటీలు లేవని అభిప్రాయపడింది. అంతేకాదు లైంగిక దోపిడీ వ్యవహారంలో మహిళా కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించింది. న్యాయ సేవధికార సంస్థ సేవలు వినియోగించుకోవాలని స్పష్టంచేసింది. ఈ అంశంపై సినిమాటోగ్రఫీ, మహిళాభివృద్ది, మహిళా కమిషన్, కార్మిక శాఖతో పాటు తెలంగాణ డిజీపీకి  హైకోర్టు నోటీసులు జారీచేసింది