సినిమా వార్తలు

అవసరాల 'ఎన్ ఆర్ ఐ' షూటింగ్ ప్రారంభం


7 months ago అవసరాల 'ఎన్ ఆర్ ఐ' షూటింగ్ ప్రారంభం

అవసరాల శ్రీనివాస్ ఒక వైపున దర్శకుడిగా కొనసాగుతూనే మరో వైపు నటుడిగా తనకి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రంగా 'ఎన్ ఆర్ ఐ' (నాయనా రారా ఇంటికి) రూపొందుతోంది. ప్రదీప్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి బాలా రాజశేఖరుని దర్శకుడు.  తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. అక్కినేని అమల క్లాప్ కొట్టగా, తొలుత ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు.  ఈ వేడుకలో సిరివెన్నెల, నాగబాబు, మంచు లక్ష్మి, అమల అక్కినేని అఖిల్ తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం దర్శకుడు మాట్లాడుతూ  "నేను 21 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నాను. ఇక్కడ .. అక్కడ నాకు ఎదురైన అనుభవాలను ఒక కథగా రాసుకుని, 'ఎన్ ఆర్ ఐ' పేరుతో తెరపైకి తీసుకురావలనుకుంటున్నాను. రొమాంటిక్ కామెడీతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతుంది" అని చెప్పారు. ఈ సినిమా ద్వారా 'మహతి' అనే తెలుగు అమ్మాయి హీరోయిన్ గా పరిచయమవుతోంది.