సినిమా వార్తలు

శ్రీకాంత్ కెరియర్‌లో మరో‘ఖడ్గం’...‘ఆపరేషన్ 2019’


10 months ago శ్రీకాంత్ కెరియర్‌లో మరో‘ఖడ్గం’...‘ఆపరేషన్ 2019’

అటు మహిళా ప్రేక్షకులతో పాటు ఇటు క్లాస్ మాస్ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న శ్రీకాంత్ ‘ఆపరేషన్ 2019’తో తన సత్తా చూపేందుకు డిసెంబరు 1న ప్రేక్షకుల ముందకు వస్తున్నారు. ‘తాజ్ మహల్’ సినిమాతో చక్కని హీరో గా గుర్తింపు పొందిన శ్రీకాంత్ కెరియర్ లో ‘ఖడ్గం’ ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. 2002లో విడుదలైన ‘ఖడ్గం’ ప్రేక్షకులను అమితంగా అలరించింది. ఈ సినిమాకు సరోజినీ దేవి అవార్డుతో పాటు నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కాయి.

ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. శ్రీకాంత్, రవి తేజ, ప్రకాష్ రాజ్, సోనాలి బింద్రే, కిమ్ శర్మ, సంగీత, బ్రాహ్మాజి,తదితరులు ఈ చిత్రంలో నటించారు. శంకర మధు మురళి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఖడ్గం సినిమాలో శ్రీకాంత్ సిన్సియర్ పోలీసు ఆఫీసర్ గా నటించారు. ఈ సినిమా ద్వారా ఇండియాలో వున్న హిందువులు ముస్లీంలు అన్నదమ్ముల్లా కలసి వుంటారని, వారిని ఎవరూ విడదీయలేరనే సందేశాన్నిచ్చారు. కాగా డిసెంబర్ 1న విడుదల కానున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ 2019’ను సామాజిక కోణంతో  పాటు అన్నిహంగులూ ఉండేలా తీర్చిదిద్దారు. ‘గాంధీ కడుపున గాంధీ పుట్టడు. ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు. మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు. ఎవరైనా ప్రజల్లో నుంచి పుట్టుకురావాల్సిందే’.. అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్‌తో సందడి చేస్తున్నాడు ‘ఆపరేషన్ 2019’ ట్రైలర్‌లో హీరో శ్రీకాంత్. కరణం బాబ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబరు 1న విడుదల కానుంది.

ఈ మూవీలో శ్రీకాంత్ పాటు మంచు మనోజ్, సునీల్‌లు కీలకపాత్రల్లో నటిస్తుండగా.. బిగ్ బాస్ ఫేమ్ దీక్షా పంత్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఖడ్గం, ఆపరేషన్ ధుర్యోధన సినిమాలే గాకుండా టాలీవుడ్‌లో దాదాపు అర్థ శతకానికి మించిన సినిమాలు చేసిన శ్రీకాంత్.. తాజాగా ఆపరేషన్ 2019 అనే పొలిటికల్ జానర్ సినిమాలో కనిపిస్తున్నారు. ఈ సినిమాకు చెందిన ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ''ఆపరేషన్ 2019'' అనే టైటిల్‌తో కూడిన ఈ సినిమాకు ''బివేర్ ఆఫ్ పబ్లిక్'' అనేది ట్యాగ్‌లైన్. ఈ చిత్రానికి సంబంధించి రెండు నిమిషాల నిడివిగల ట్రైలర్‌ని సినీ యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్‌ని బట్టి చూస్తే.. ఆపరేషన్ దుర్యోధనను మించిన పొలిటికల్ థ్రిల్లర్‌గా కనిపిస్తోంది. ఈసారి కూడా సీరియస్ రాజకీయ నాయకుడి పాత్రలో శ్రీకాంత్ దుమ్ముదులిపేలా కనిపిస్తున్నారు.