సినిమా వార్తలు

విజయ్ దేవరకొండతో శ్రీదేవి కుమార్తె సినిమా?


10 months ago విజయ్ దేవరకొండతో శ్రీదేవి కుమార్తె సినిమా?

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే విజయ్ దేవరకొండ స్టార్ హోదా దక్కించుకున్నాడు. వరుస విజయాలతో దూసుకువెళుతున్నాడు. రీసెంట్ గా 'టాక్సీవాలా'తో మరో విజయాన్ని అందుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాట కూడా అతడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా బాలీవుడ్ లో జరిగిన ఓ సంఘటనని బట్టి అక్కడ కూడా అతడికి ఉన్న క్రేజ్ బయటపడింది. అసలు విషయంలోకి వస్తే.. దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఓ పాపులర్ టీవీ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమెకి 'ఒకవేళ నువ్వో రోజు ఓ మేల్ యాక్ట‌ర్‌గా నిద్ర లేస్తే… ఎవరిలా మేల్కోవాలని అనుకుంటావ్? ఎందుకు?' అనే ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానంగా ఆమె విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. మంచి టాలెంట్ ఉన్న నటుడు అంటూ అతడిని పొగిడేసింది. అంతేకాదు.. తనతో సినిమా చేయాలని ఉందని వెల్లడించింది. ఆమె మాటలు వింటుంటే విజయ్ దేవరకొండపై జాన్వీ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తుందని తెలుస్తోంది. గతంలో విజయ్ దేవరకొండతో జాన్వీ ఓ సినిమా చేస్తున్నదనే వార్తలు వినిపించాయి కానీ అవి రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఇప్పుడైనా ఈ కాంబినేషన్ లో సినిమా సెట్ అవుతుందేమో చూడాలి!