సినిమా వార్తలు

చిరు తదుపరి సినిమా పై ఊహాగానాలు


1 year ago చిరు తదుపరి సినిమా పై ఊహాగానాలు

ప్రస్తుతం చిరంజీవి హీరోగా 'సైరా' రూపొందుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా తరువాత ఆయన కొరటాల దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టు సమాచారం. అందుకు సంబంధించిన పనుల్లోనే కొరటాల బిజీగా వున్నారట. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్నాడని అంటున్నారు. ఈ సినిమా నిర్మాణంలో కొరటాల భాగస్వామి కానున్నాడని భోగట్టా. ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. ఇంతవరకూ కొరటాల తెరకెక్కించిన సినిమాలన్నీ భారీ వసూళ్లను రాబడుతూ విజయాలను అందుకున్నాయి.

దాంతో కొరటాల నిర్మాతగాను రంగంలోకి దిగుతున్నాడని చెప్పుకుంటున్నారు.  ఈ చిత్రాన్ని కూడా మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రామ్ చరణే నిర్మించనున్నారని అంటున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లలో కాకుండా ఇంకా ఇతర బ్యానర్లలో ఈ సినిమా తెరకెక్కబోతుందనే వార్తలు వస్తుండటంతో వెంటనే చిత్ర యూనిట్.. ఈ రెండు బ్యానర్స్ కాకుండా వేరే బ్యానర్స్ పేరు వినిపిస్తే నమ్మవద్దు.. అంటూ క్లారిటీ ఇచ్చింది.