సినిమా వార్తలు

‘RRR’ కధనం పై ఊహాగానాలు


9 months ago ‘RRR’ కధనం పై ఊహాగానాలు

దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ‘RRR’ సినిమా కథపై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోందని అంటున్నారు. పిరియాడికల్ మూవీ అని.. స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో రూపొందుతోందని ఓ కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బందిపోటుగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోలీసు అధికారిగా నటిస్తున్నారని మరో కథనం వినిపిస్తోంది.

అయితే తాజాగా మరో ఆసక్తికర కథనం వినిపిస్తోంది. ‘RRR’లో ఎన్టీఆర్, చెర్రీ చనిపోతారట.. తారక్, చెర్రీ ఇద్దరూ ప్రాణ స్నేహితులని... స్వాతంత్ర్య పోరాట సమయంలో జరిగే భీకర పోరులో వీరిద్దరూ చనిపోతారట... అనంతరం వీరిద్దరూ తిరిగి జన్మిస్తారని.. 2000 సంవత్సరంలో తిరిగి ప్రాణ స్నేహితులుగా మారతారంటూ ఒక కథనం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ కథ రాజమౌళి దర్శకత్వంలో.. చెర్రీ హిరోగా వచ్చిన మగధీర కథతో పోలిక ఉన్నప్పటికీ.. అది ఒక్క పునర్జన్మ విషయానికి మాత్రమే పరిమితమని.. మిగిలిన కథంతా పూర్తి భిన్నంగా ఉంటుందని సమాచారం