సినిమా వార్తలు

పుల్లెల గోపీ‌చంద్‌గా సోనూసూద్


9 months ago పుల్లెల గోపీ‌చంద్‌గా సోనూసూద్

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్‌ల సీజన్‌ నడుస్తోంది. క్రీడాకారుల బయోపిక్స్‌ మంచి విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్‌లో కూడా క్రీడా నేపథ‍్యమున్న బయోపిక్స్‌ తెర మీదకు వస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాదీ బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ షూటింగ్ ప్రారంభమైంది. అలాగే మరో స్టార్‌ ప్లేయర్‌ పీవీ సింధు జీవిత కథ సినిమాగా రూపొందుతోంది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధు బయోపిక్‌ను బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌ నిర్మిస్తున్నారు. కొన్నాళ్లుగా ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ మధ్యకాలంలో సింధు మరిన్ని విజయాలు సాధించటంతో ప్రతీ సారి స్క్రిప్ట్‌ను రీరైట్‌ చేస్తూ వస్తున్నారని సమాచారం. దీంతో ఇప్పటికే 24 వర్షన్లు రాసినట్టు సమాచారం. అయితే వీటిలో సింధు ఏ వర్షన్‌కు ఓకే చెప్తే దాన్నే సినిమాగా రూపొందించే ఆలోచనలో సోనూ సూద్ ఉన్నారు. ఇంకా సింధు పాత్రలో కనిపించబోయే నటిని ఫైనల్‌ చేయకపోయినప్పటికీ, ఈ సినిమాలో పీవీ సింధు గురువైన పుల్లెల గోపీచంద్ పాత్రలో సోనూసూద్ కనిపిచనున్నాడని సమాచారం.