సినిమా వార్తలు

అయ్యో... పాపం ఈశా రెబ్బా!


11 months ago అయ్యో... పాపం ఈశా రెబ్బా!

తెలుగమ్మాయి సెలెక్టెడ్ సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతంలో “అ” తో ఆకట్టుకున్న ఈశా రెబ్బాకి ఎన్టీఆర్ హీరోగా నటించిన “అరవింద సమేత” లో ఒక ముఖ్యపాత్రలో నటించే అవకాశం లభించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్, జూనియర్ ఎన్టీఆర్ హీరో కాబట్టి ఆ సినిమా చెయ్యడానికి ఈశా రెబ్బా ఒప్పుకుంది.  కానీ సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే అసలు ఈశా రెబ్బా క్యారెక్టర్ కు సినిమాలో ప్రాధాన్యత లేనే లేదు. ప్రాధాన్యత లేని క్యారెక్టర్ ఈశా ఒప్పుకోవడం తప్పు , లేదంటే ఎక్కువ సన్నివేశాలు చిత్రీకరించి వాటిని ఎడిట్ చేసి సినిమాలో కొన్ని సన్నివేశాలే ఉంచారేమో. ఏదేమైనా సరే సినిమా రిలీజ్ అయిన ఈశ కి ఈ సినిమాలో అన్యాయం జరిగిందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా దెబ్బతో హీరోయిన్ గా వెలిగిపోవాలని ఆశించిన ఈశా రెబ్బా కు నిరాశే ఎదురైందంటున్నారు. దీంతో ఆమెకు సైడ్ క్యారెక్టర్ లు మాత్రమే వస్తాయిగాని పెద్ద సినిమాల్లో మాత్రం హీరోయిన్ గా అవకాశాలు రావేమోననే టాక్ వినిపిస్తోంది.