సినిమా వార్తలు

ఘంటసాల బయోపిక్ లో సింగర్ కృష్ణ చైతన్య?


1 year ago ఘంటసాల బయోపిక్ లో సింగర్ కృష్ణ చైతన్య?

భక్తి గీతాలను, యుగళ గీతాలను, విషాద గీతాలను, ఇలా అన్ని రకాల పాటలను అలనాటి దివవంగత ఘంటసాల వెంకటేశ్వరరావు తన స్వరంలో అద్భుతంగా పలికించారు. అగ్రస్థాయి హీరోలకే కాదు, ఆనాటి కమెడియన్స్ కి కూడా ఆయన పాటలు పాడారు. గాయకుడిగానే కాదు, సంగీత దర్శకుడిగా కూడా ఆయన విజయం సాధించారు. కెరియర్ ఆరంభంలో ఘంటసాల ఎన్నో కష్టాలు పడ్డారు. ఏపీలోని విజయనగరంలో సంగీత సాధన చేసే రోజుల్లో వారాలబ్బాయిగా పొట్ట పోషించుకున్నారు. అలాంటి ఘంటసాల జీవితచరిత్రను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఘంటసాల జీవితచరిత్రపై పరిశోధన చేసిన సీహెచ్ రామారావు, ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. ఘంటసాల పాత్రను సింగర్ కృష్ణ చైతన్య పోషించనున్నాడని చెబుతున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది త్వరలోనే తేలనుంది.