సినిమా వార్తలు

సుధీర్ వర్మ దర్శకత్వంలో కాజల్ తో శర్వా రొమాన్స్


7 months ago సుధీర్ వర్మ దర్శకత్వంలో కాజల్ తో శర్వా రొమాన్స్

తొలి ప్రయత్నమైన ‘స్వామిరారా’ చిత్రంతో  సుధీర్ వర్మ దర్శకుడిగా విజయవంతం అయ్యాడు.  ఆ తర్వాత ఆయన చేసిన దోచెయ్, కేశవ లాంటి చిత్రాలు నిరాశనే మిగిల్చాయి. ప్రస్తుతం ఈ యువదర్శకుడు శర్వానంద్ హీరో ఓ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. గ్యాంగ్ స్టర్ కథగా థ్రిల్లర్ అంశాలతో సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ విభిన్నమైన లుక్ లో కనిపించనున్నాడని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ స్పెయిన్ లో జరుగుతోంది. కాజల్ అగర్వాల్, శర్వానంద్ పై భారీ ఖర్చుతో ఓ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ లో 250 మంది డాన్సర్లు పాల్గొంటున్నారట. సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి త్వరలోనే టైటిల్ వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. కాగా శర్వానంద్ చివరాగా నటించిన పడిపడిలేచేమనసు చిత్రం నిరాశపరిచింది. అయితే దర్శకుఢు సుధీర్ వర్మ, శర్వానంద్ ఇద్దరూ ఈ చిత్రంతో తిరిగి విజయాన్ని అందుకుకోవాలని తపిస్తున్నారు.