సినిమా వార్తలు

శంకర్ పై భరోసాతోనే '2.ఓ' రజనీకాంత్


10 months ago శంకర్ పై భరోసాతోనే '2.ఓ' రజనీకాంత్

అత్యధిక బడ్జెట్ తో రజనీకాంత్  '2.ఓ' రూపొందింది. సినిమా అత్యధిక థియేటర్లలో విడుదలైంది. అలాంటి ఈ సినిమాను గురించి తాజా ఇంటర్వ్యూలో రజనీకాంత్ మాట్లాడారు. "సాధారణంగా ఇతర దర్శకుల విషయంలో ఆర్టిస్టులకే పని ఎక్కువగా ఉంటుంది. శంకర్ దగ్గరికి వచ్చేసరికి టెక్నీషియన్స్ కి పని ఎక్కువగా ఉంటుంది. ఇతర దర్శకులతో ఆర్టిస్టులు తమ ఆలోచనలు షేర్ చేసుకోగలుగుతారు. కానీ శంకర్ సినిమా పూర్తిగా ఆయన ఇమాజినేషన్ పైనే ఆధారపడి నడుస్తుంది.

అయినా అప్పుడప్పుడు ఆయన మా ఆలోచనలకి కూడా ప్రాధాన్యతనిస్తుంటాడు. తనకి ఏం కావాలనేది శంకర్ కి పర్ఫెక్ట్ గా తెలుసు. అందువలన ఇటు ఆర్టిస్టులు .. అటు సాంకేతిక నిపుణులు అందరూ కూడా ఆయనపై పూర్తి భరోసాతో పనిచేస్తారు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హాలీవుడ్ స్థాయి సినిమాలకి ఎంతమాత్రం తీసిపోదు" అని చెప్పారు.