సినిమా వార్తలు

అల్లు అర్జున్ కు షారుక్ ఖాన్ కితాబు


7 months ago అల్లు అర్జున్ కు షారుక్ ఖాన్ కితాబు

జీరో సినిమా ప్ర‌మోష‌న్ లో ఉన్న బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తన మార్కెట్ ను మ‌రింత‌గా పెంచుకునే పనిలో ప‌డ్డారు. ‘చెన్నై ఎక్స్ ప్రెస్’  సినిమాతో కోలీవుడ్ మార్కెట్ లో అడుగుపెట్టిన ఆయ‌న‌ తాజాగా టాలీవుడ్ స్టైలిష్  స్టార్ అల్లు అర్జున్ ను ప్రశంసల్లో ముంచెత్తాడు. బన్నీ చాలా టాలెంటెడ్ అని మెచ్చుకున్నారు. త్వరలోనే బన్నీని కలుస్తానని ప్రకటించారు. ప్రస్తుతం తన సినిమా ‘జీరో’ ప్రమోషన్ వేడుకల్లో షారుక్ బిజీగా ఉన్నారు. ఆనంద్‌ ఎల్‌రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన‌ జీరో సినిమాలో షారుఖ్‌ మరుగుజ్జుగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో కింగ్ ఖాన్ సరసన బాలీవుడ్ భామ‌లు కత్రినా కైఫ్, అనుష్కా శర్మ నటించారు. ఇటీవలి కాలంలో సరైన హిట్ అందుకోని కింగ్ ఖాన్ జీరో సినిమాతో తిరిగి ఫామ్ లోకి రావాలని తాప‌త్ర‌య ప‌డుతున్నారు.