సినిమా వార్తలు

అర్జున్‌కి క్షమాపణ చెప్పనన్న శృతి


10 months ago అర్జున్‌కి క్షమాపణ చెప్పనన్న శృతి

ప్రముఖ సీనియర్ నటుడు అర్జున్‌పై నటి శృతి హరిహరణ్ ‘మీటూ’ ఆరోపణలు చేసిన విషయం విదితమే. ‘నిబునన్’ సినిమా చిత్రీకరణ సమయంలో తనతో అర్జున్ అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆమె ఆరోపించింది. దీంతో సినీ ఇండస్ట్రీ రెండు వర్గాలుగా చీలిపోయింది. అయితే ఎక్కువ శాతం అర్జున్‌కే అండగా నిలబడ్డారు. అర్జున్ తాజాగా శృతిపై కోర్టులో కేసు వేశారు. అర్జున్ తరుపున ఆయన మేనల్లుడు ధృవ బెంగుళూరు సివిల్ న్యాయస్థానంలో శృతిపై రూ.5 కోట్లకు దావా వేశారని తెలుస్తోంది.

ఇది జరిగిన కొన్ని గంటలకే అర్జున్‌, శృతిలను పిలిచి కర్ణాటక ఫిలిం ఛాంబర్‌ సమావేశం ఏర్పాటుచేసింది. సమస్యను పరిష్కరించేందుకు ఛాంబర్ అధ్యక్షుడు అంబరీష్ ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. శ‌‌ృతి బహిరంగా క్షమాపణ చెప్పాలని అర్జున్ కోరగా, తాను ఇప్పటికీ అదే మాట మీదే నిలబడతానని.. క్షమాపణ చెప్పేదే లేదని శృతి తెగేసి చెప్పింది.