సినిమా వార్తలు

సెల్ఫీల గోలను తట్టుకోలేకపోతున్న ప్రభాస్


9 months ago సెల్ఫీల గోలను తట్టుకోలేకపోతున్న ప్రభాస్

కూర్చుటే సెల్ఫీ, నిల్చుంటే సెల్ఫీ, నిద్రపోయేటప్పుడూ సెల్ఫీనే... మనిషి జీవితంలో సెల్ఫీ ఒక భాగంగా  మారిపోయింది. సామాన్యుడు సెల్ఫీలకు ఇంతగా పరితపించిపోతుంటే... మరి పెద్ద స్టార్స్ ను వారి అభిమానులు సెల్పీలకోసం ఎంతగా ఇబ్బంది పెడుతున్నారోమరి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బయటకు వచ్చినప్పుడు ఇదే సమస్యతో సతమతమైపోతున్నాడట. ఎప్పుడైతే బాహుబలి చిత్రాన్ని చేశాడో అప్పటి నుంచి టాలీవుడ్ స్టార్ హీరోల కంటే చాలా మెట్లు పైకి వెళ్లి పోయాడు. హాలీవుడ్ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు.  ఇండియన్స్ ఏ దేశంలో ఉన్నా కూడా తనను గుర్తించి ఇబ్బంది పెడుతున్నారట. ఇదే విషయమై ప్రభాస్ ఈ మధ్య మీడియాకిచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ  తాను ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోని ఏ ప్రముఖ నగరానికి వెళ్లినా కూడా సెల్ఫీల కోసం మీద పడిపోతున్నారని చెప్పారు.

దీంతో తన వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలుగుతున్నదని పేర్కొన్నాడు. కొన్ని సార్లు ఇది చక్కగానే అనిపించినా, అప్పుడప్పుడు తనకు స్వేచ్చ లేకుండా పోవడంతో చిరాకుగా అనిపిస్తుందని అన్నారు. అందుకే బయటకు వెళ్లేందుకు మాస్క్ ను వాడుతున్నట్లుగా చెప్పారు బయటకు వెళ్లే సమయంలో తన వద్ద 50 బ్యాండనాస్ లు 60 క్యాప్ ల వరకు ఉంటాయని తెలపాడు. అవి ధరిస్తే తప్ప నేను బయట స్వేచ్చ గా తిరుగలేక పోతున్నానని ప్రభాస్ నవ్వుతూ చెప్పారు. కాగా ప్రస్తుతం ఈయన సాహో చిత్రం తో పాటు రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నారు.