సినిమా వార్తలు

స‌వ్య‌సాచి` టైటిల్ సాంగ్ రిలీజ్


11 months ago స‌వ్య‌సాచి` టైటిల్ సాంగ్ రిలీజ్

చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో హీరో నాగ‌చైత‌న్య న‌టిస్తున్న చిత్రం `స‌వ్యసాచి`. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌. మాధ‌వ‌న్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉన్న ఈ సినిమా వ‌చ్చే నెల రెండో తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ద‌స‌రా సంద‌ర్భంగా ఈ సినిమాలోని టైటిల్ సాంగ్‌ను చిత్ర‌బృందం సోష‌ల్ మీడియా ద్వారా విడుద‌ల చేసింది. `స‌వ్య‌సాచి.. ఆగ్ర‌హో.. ద‌గ్ర‌దో..` అంటూ పూర్తిగా సంస్కృత ప‌దాల‌తో సాగిన ఈ పాట‌ను కీర‌వాణి తండ్రి శివ‌శ‌క్తి ద‌త్తా, రామ‌కృష్ణ కోడూరి రాశారు. అద్భుత‌మైన పాట‌ను అందించిన కీర‌వాణి, శివ‌శ‌క్తి ద‌త్తాల‌కు నాగ‌చైత‌న్య ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశాడు.