సినిమా వార్తలు

సప్తగిరి కొత్త సినిమా 'వజ్రకవచధర గోవిందా'


8 months ago సప్తగిరి కొత్త సినిమా 'వజ్రకవచధర గోవిందా'

తెలుగు తెరపై కామెడీతో సందడి చేస్తోన్న వారిలో సప్తగిరి ఒకరు. డైలాగ్ డెలివరీతోపాటు బాడీ లాంగ్వేజ్ లోను సప్తగిరి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కమెడియన్ గా మంచి క్రేజ్ రావడంతో హీరోగా అవకాశాలు కూడా దక్కించుకున్నాడు. గతంలో హీరోగా సప్తగిరి చేసిన 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' ఆయనకి మంచి మార్కులు తెచ్చిపెట్టింది. అదే దర్శకుడు అరుణ్ పవార్ దర్శకత్వంలో సప్తగిరి మళ్లీ ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాడు. నరేంద్ర .. జీవీఎన్ రెడ్డి నిర్మాతలుగా రూపొందుతున్న ఈ సినిమాకి, 'వజ్రకవచధర గోవిందా' అనే టైటిల్ ను ఖరారు చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుందని సమాచారం. సప్తగిరి తాను హీరోగా నిలదొక్కుకోవడానికి  చేస్తున్న ప్రయత్నాలు ఈ సినిమాతోనైనా నెరవేరుతాయేమో చూడాలి. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.