సినిమా వార్తలు

బాగానే లాక్కొస్తున్న స‌ప్త‌గిరి


7 months ago బాగానే లాక్కొస్తున్న స‌ప్త‌గిరి

కమెడియన్ స‌ప్త‌గిరి.. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’, ‘సప్తగిరి ఎల్ఎల్‌బీ’ చిత్రాలతో హీరోగా సత్తా చాటాడు. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అరుణ్ పవార్ డైరెక్షన్‌లో స‌ప్త‌గిరి మ‌రో చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ‘వజ్ర కవచధర గోవింద’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ట్రైలర్ ఆకట్టుకోవడం తో చిత్ర రైట్స్ కు మంచి డిమాండ్ ఏర్పడింద‌ని తెలుస్తోంది. దాదాపు 80శాతం పూర్తయిన ఈ సినిమాను ఫస్ట్ కాపీతో ఎంజీ పద్దతిలో విక్ర‌యించార‌ట‌. సినిమాను వరల్డ్ వైడ్ థియేటర్ రైట్స్ మూడుకోట్లు అరవై లక్షలకు అమ్మేసినట్లు చెప్పుకుంటున్నారు. ఆంధ్ర, సీడెడ్, నైజాంల్లో మూడుకోట్ల అరవై లక్షలకు మినిమమ్ గ్యారంటీ ఇచ్చి సీడెడ్ కు చెందిన బ్రహ్మయ్య తీసుకున్నట్లు ఫిల్మ్ న‌గ‌ర్ టాక్‌. సినిమాకు నాల్గు కోట్ల ఖర్చు అయితే , థియేటర్ హక్కులతో రికవరీ అవ్వగా , శాటిలైట్, డిజిటల్ తో నిర్మాతలకు లాభం రావాల్సివుంది. వైభవీ జోషీ ఈ సినిమాలో కథానాయిక. అలాగే ఈ చిత్రంలో అర్చనా వేద, టెంపర్ వంశీ, అప్పారావు, అవినాష్ తదితరులు న‌టిస్తున్నారు.