సినిమా వార్తలు

చిన్నారులతో రియల్ సమంత!


9 months ago చిన్నారులతో రియల్ సమంత!

సేవ చేయడం అంటే జాలి కురిపించడం కాదు, వారిపై ప్రేమ కురిపించడం అంటోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. క్రిస్మస్ సందర్భంగా శాంటా అవతారంలో సమంత డిజైర్ సొసైటీకి చెందిన చిన్నారులను షాపింగ్ మాల్‌కు తీసుకెళ్లింది. అక్కడ వారికి ఇష్టమైన దుస్తులు కొనిచ్చింది. పిల్లలంతా షాపింగ్ మాల్లో తిరుగుతూ తమకు ఇష్టమైన దుస్తులు వారే సెలక్ట్ చేసుకున్నారు. వారి కళ్లలో కనిపించిన ఆనందం చూసి సమంత ఎంతగానో మురిసిపోయింది. వారితో గడిపిన ఆనందకర క్షణాలను సోషల్ మీడియా ద్వారా సమంత అభిమానులతో పంచుకుంది.  కాగా హెచ్ఐవి/ఎయిడ్స్‌ బారిన పడ్డన చిన్నారుల కోసం డిజైర్ సొసైటీ నడుపుతున్నారు. నాలో ఎంతో స్పూర్తి నింపారు డిజైర్ సొసైటీ పిల్లలు, నిర్వాహకులు.. ఒకే ఒక్క రోజులో నాలో ఎంతో స్పూర్తి నింపారు. మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూడాలి, మీలో మరింత ఆత్మస్తైర్యం నింపాలి అని సమంత వ్యాఖ్యానించారు. సమంత చేసిన ఈ పనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రత్యూష ఫౌండేషన్ తరుపున సమంత ఈ సేవా కార్యక్రమం నిర్వహించింది. తాము నిర్వహిస్తున్న ఈ ఫౌండేషన్‌కు ఇది చాలా ప్రత్యేకమైన రోజు అని సమంత పేర్కొంది.