సినిమా వార్తలు

‘metoo’కు సమంత మద్దతు


8 months ago ‘metoo’కు సమంత మద్దతు

ఇటీవల కొంతకాలంగా చిత్ర పరిశ్రమలో జరుగుతున్న ‘metoo’ ఉద్యమానికి తానూ మద్దతు తెలుపుతానని కథానాయిక సమంత పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా...నానా పటేకర్‌ తనను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా ఈ విషయం చర్చనీయాంశంగా నిలస్తోంది. చివరికి ఇద్దరూ ఒకరికొకరు నోటీసులు ఇచ్చుకునేవరకూ వెళ్లింది. వీరిద్దరి కేసు ఓ కొలిక్కి రాకముందే ఒక్కొక్కరుగా తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి వివరాలు తెలియజేస్తూ వస్తున్నారు. ఇటీవల ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద కూడా చిన్నప్పుడు తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. చిన్మయి, సమంత చాలా కాలంగా మంచి స్నేహితులు. దాంతో వేధింపులను ఎదుర్కొన్న ఆడవాళ్లకు తాను మద్దతుగా నిలుస్తానంటూ సమంత వెల్లడించారు.

ఈ మేరకు ఆమె ట్విటర్‌ ద్వారా తన అభిప్రాయాన్ని తెలిపారు. ‘చాలా మంది మహిళలు ధైర్యం తెచ్చుకుని తాము ఎదుర్కొన్న సంఘటనల గురించి బయటపెడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మీ ధైర్యాన్ని నిజంగా మెచ్చుకోవాల్సిందే. ఈ విషయంలో కొందరు వ్యక్తులు, మహిళలు మిమ్మల్ని నిలదీస్తూ, ప్రశ్నిస్తున్నందుకు సారీ. మీరు నోరు తెరిచి మాట్లాడటం వల్ల చెప్పుకోలేని చిన్న పిల్లలను మీరు కాపాడినవారవుతారు. అందుకు నా ధన్యవాదాలు. ఈ ‘metoo’ ఉద్యమానికి నేను మద్దతు తెలుపుతున్నాను’ అని సమంత వెల్లడించారు