సినిమా వార్తలు

నెటిజన్‌కు ఘాటుగా సమంత సమాధానం


11 months ago నెటిజన్‌కు ఘాటుగా సమంత సమాధానం

ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటుంది. వాళ్లు అడిగే సరదా ప్రశ్నలకు అంతే సరదాగా జవాబిస్తుంటుంది. అయితే తాజాగా మీ టూ ఉద్యమం సందర్భంగా కొందరు నెటిజన్ల వ్యవహారశైలిపై సామ్ కు కోపం తెప్పించింది. ఉద్యమంపై సమంత స్పందిస్తూ.. గాయని చిన్మయి శ్రీపాద చెప్పిన విషయాలను తాను నమ్ముతున్నానని చెప్పింది. దీంతో ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగినదాన్ని ఇప్పుడు బయటపెట్టాల్సిన అవసరం ఏంటని పలువురు నెటిజన్లు సమంతను డైరెక్టుగానే అడిగారు. దీనికి సమంత స్పందిస్తూ..‘మా భయం కూడా అదే.. తప్పంతా మాదే అని మీరెక్కడ అంటారోనన్న భయంతోనే సమయం కుదిరినప్పుడల్లా సమస్యలను బయటపెడుతున్నాం’ అని ట్వీట్‌ చేశారు. వెంటనే గౌరవ్‌ ప్రధాన్‌ అనే మరో నెటిజన్‌ ‘‘ఈరోజు మా అబ్బాయి నన్ను ఓ ప్రశ్న అడిగాడు. ‘డాడీ అసలు ఈ ‘మీ టూ’ అంటే ఏంటి?’ అని అడిగాడు. అప్పుడు నేను ‘మీటూ అంటే ఆడవారి రిటైర్మెంట్‌ బీమా పథకం’ అని చెప్పాను. అప్పుడు మా అబ్బాయి ‘అంటే ఏమిటీ?’ అని మళ్లీ అడిగాడు. దీంతో ‘ఆడవాళ్లు అన్ని విషయాల్లో తలదూరుస్తారు. కెరీర్‌ ముగిశాక ఈ బీమాను వాడుకుంటారు. అప్పుడు వాళ్ల గురించి విలేకరులు వార్తలు రాస్తుంటారు’’ అని చెప్పా. ఇది విని మా అబ్బాయి ‘గాడ్‌ బ్లెస్‌ ఇండియా’ అని అన్నాడు’’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఈ కామెంట్లపై తీవ్రంగా స్పందించిన సమంత..‘అదే ప్రశ్న నీ కూతురు అడిగితే ఏం చెబుతావ్?’ అని ఘాటుగా ప్రశ్నించారు. దీంతో సదరు నెటిజన్ మరో కామెంట్ చేయలేకపోయాడు.