సినిమా వార్తలు

ఆ పాత్రకి నో చెప్పేసిన సమంత?


8 months ago ఆ పాత్రకి నో చెప్పేసిన సమంత?

మొన్నటి వరకూ గ్లామర్ పాత్రలనే ఎక్కువగా చేస్తూ వచ్చిన సమంత, ఇటీవలి కాలంలో నటనకి అధిక ప్రాధాన్యత కలిగిన పాత్రలను చేయడానికి ఆసక్తిని చూపుతోంది. నటన పరంగా తనకు మంచి పేరు తెచ్చిపెట్టే విభిన్నమైన పాత్రలను చేయడానికి ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ నేపధ్యంలోనే ఆమె నందినీ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి అంగీకరించింది. కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ'కి ఇది రీమేక్. ఈ సినిమాకి 'ఓ బేబీ' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో సమంత  యువతిగానే కాకుండా 70 యేళ్ల బామ్మగాను కనిపించనుందనే టాక్ వచ్చింది. అప్పట్లో బామ్మ పాత్ర చేయడానికి సమంత అంగీకరించినప్పటికీ, ఆ తరువాత సన్నిహితుల సలహా మేరకు వెనక్కి తగ్గిందని టాలీవుడ్ల లో వినిపిస్తోంది. వృద్ధురాలి పాత్రలో కనిపిస్తే ఆ ప్రభావం కెరియర్ పై పడుతుందని భావించి ఆమె 'నో' చెప్పేసిందట. దాంతో వృద్ధురాలి పాత్రకు సీనియర్ హీరోయిన్ లక్ష్మిని ఎంపిక చేసుకున్నారని సమాచారం. అంటే యువతిగా వున్నప్పుడు సమంత, ఆ పాత్ర ముసలితనం ఉన్నప్పుడు లక్ష్మి తెరపై కనిపిస్తారని తెలుస్తోంది.