సినిమా వార్తలు

మరో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో సమంత


1 year ago మరో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో సమంత

హీరోయిన్‌ సమంత ఇటీవల నాయికా ప్రాధాన్యమున్న సినిమా ‘యూటర్న్’లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. మళ్లీ అలాంటి చిత్రం కోసమే సామ్ సైన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని మరో మహిళ తెరకెక్కించనున్నట్టు సమాచారం. 'అలా మొదలైంది', 'కల్యాణ వైభోగమే' వంటి చిత్రాలతో ఆకట్టుకున్న నందినీరెడ్డి సామ్ కోసం కథ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ సారధ్యంలో ఈ సినిమా రూపొందనుంది. ఇక ఈ ఏడాది సామ్‌కు బాగా కలిసొచ్చింది. ఆమె నటించిన చిత్రాలన్నీ ఈ ఏడాది మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం సామ్ తన భర్త నాగ చైతన్యతో కలిసి ఓ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తవగానే నందినీ రెడ్డి దర్శకత్వంలో సినిమా ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది.