సినిమా వార్తలు

షాకిచ్చే పాత్రను ఎన్నుకున్న సమంత


10 months ago షాకిచ్చే పాత్రను ఎన్నుకున్న సమంత

చైతూతో వివాహం తరువాత వైవిధ్య పాత్రలను ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతున్న అక్కినేని కోడలు సమంత మరో కొత్త పాత్రలో నటించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. ‘‘ఇంతవరకు నేను చేయని ఆసక్తికర పాత్ర కోసం సిద్ధమవుతున్నాను. ఈ పాత్ర విని నేనే చాలా భయపడ్డా. అయినా ఛాలెంజ్‌లను ఒప్పుకోవడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటా. నీ గురించి నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ బలవంతురాలువి’ అంటూ తన కామెంట్ పోస్ట్ చేసింది సమంత. దానికి న్యూ బిగినింగ్స్ అనే ట్యాగ్ కూడా తగిలించింది. అయితే కొరియన్‌లో విజయం సాధించిన మిస్ గ్రానీ రీమేక్‌లో సమంత నటించనున్న విషయం తెలిసిందే. ఇందులో వృద్ధురాలుగా, యంగ్‌గా రెండు పాత్రలలో సమంత నటించనుంది. ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనున్నదని తెలుస్తోంది. ఈ చిత్రంతో పాటు సమంత నాగ చైతన్య సరసన మజిలీలో నటిస్తోంది.