సినిమా వార్తలు

'96' తెలుగు రీమేక్ కి సమంత గ్రీన్ సిగ్న‌ల్‌


9 months ago '96' తెలుగు రీమేక్ కి సమంత గ్రీన్ సిగ్న‌ల్‌

విజయ్ సేతుపతి ... త్రిష జంటగా ఇటీవ‌ల‌ వచ్చిన '96' అనే తమిళ చిత్రం భారీ విజయాన్ని ద‌క్కించుకుంది. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా త‌మిళ‌ విమర్శకుల నుంచి  ప్రశంసలు కూడా అందుకుంది. అలాంటి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనే ఉద్దేశంతో దిల్ రాజు రైట్స్ తీసుకున్నార‌ని తెలుస్తోంది. ఈ సినిమాలో నటించబోయే కొంతమంది హీరోల‌ పేర్లు వినిపించాయిగానీ, చివరికి శర్వానంద్ ను ఎంపిక చేసుకున్నార‌ని తెలుస్తోంది. అలాగే తమిళంలో త్రిష చేసిన పాత్ర కోసం ఆమెనే తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ సమంతను ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. ఇది ప్రేమకథా చిత్రమే అయినా హీరో .. హీరోయిన్ ని టచ్ చేయడం అనేది ఉండ‌ద‌ట‌. అంతగా నటనకు .. ఫీలింగ్స్ కి మాత్రమే ప్రాధాన్యతనిచ్చే సినిమాగా ఇది రూపొందింది. అందువల్లనే ఈ సినిమా చేయడానికి వెంటనే సమంత అంగీకరించిందని అంటున్నారు. దర్శకుడు, త‌దిత‌ర వివరాలు త్వరలో తెలియనున్నాయి.