సినిమా వార్తలు

విహారయాత్రకు సమంత!


1 year ago విహారయాత్రకు సమంత!

అక్కినేని వారింటి కోడలిగా కొత్త కోడలిగా అడుగుపెట్టిన హీరోయిన్ సమంతకు ఈ సంవత్సరం ఎంత ప్రత్యేకమైనది. ఆమె నటించిన 'రంగస్థలం', 'మహానటి', 'యూటర్న్', 'ఇరుంబుదురై' (తెలుగులో అభిమన్యుడు) చిత్రాలు బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. తన తరువాతి చిత్రాన్ని భర్త నాగ చైతన్యతో కలసి చేయనున్న సమంత, ఈలోగా చిన్న బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకుని, అనుకున్నదే తడవుగా విహారయాత్రకు వెళ్లిపోయింది.

ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్ తో పంచుకున్న ఆమె, 'ఫైనల్లీ వెకేషన్' అంటూ కామెంట్ చేసింది.అక్టోబర్ 6న సమంత, చైతూల వివాహ దినోత్సవం కాగా, అదే రోజున వీరి కొత్త సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఆ సమయానికి సమంత తన టూర్ ను ముగించుకుని తిరిగి వస్తారని సమాచారం.