సినిమా వార్తలు

సంప్రదాయం చెప్పిన ఫ్యాన్స్ పై సమంత ఫైర్


1 year ago సంప్రదాయం చెప్పిన ఫ్యాన్స్ పై సమంత ఫైర్

సోషల్ మీడియాలో సమంత చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన భర్త నాగచైతన్యతో కలసి ప్రస్తుతం ఆమె స్పెయిన్ లో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫొటోలను ఆమె షేర్ చేసింది. పొట్టి డ్రస్సులో చాలా హాట్ గా ఉన్న ఓ ఫొటోను కూడా ఆమె పంచుకుంది. ఈ ఫొటోపై పలువురు విమర్శలు ఎక్కుపెట్టారు. పెళ్లి అయిన తర్వాత కూడా ఇలాంటి డ్రస్సులు ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి దుస్తుల్లో నిన్ను చూడలేకపోతున్నామని, ఫొటోలను వెంటనే డిలీట్ చేయాలని సూచించారు. ఇంకోసారి ఇలాంటి ఫొటోను షేర్ చేయవద్దని కూడా చెప్పారు. ఈ విమర్శలపై సమంత స్పందించింది. తను వేసుకున్న డ్రెస్సుపై మిమర్శలు చేస్తూ, పెళ్లి తర్వాత తాను ఎలా జీవించాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలో నీతులు చెప్పిన వారికి సమంత గట్టి సమాధానం ఇచ్చింది. మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఘాటుగా రియాక్ట్ అయ్యింది.  దీనికి సమంత ఇన్నర్ పీస్ అనే క్యాప్షన్ తగిలిచింది. గతంలో కూడా సమంత బికినీ ఫోటో పోస్టు చేస్తే, కొందరు విమర్శలకు దిగిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా సమంత తనదైన శైలిలో మండి పడ్డారు. మీ పని మీరు చూసుకోండి, నా జీవితం గురించి ఆలోచించడం మానేయండూ ఫైర్ అయ్యారు. సమంత ఇలాంటి కామెంట్స్ అస్సలు పట్టించుకోదని, ఆమె చాలా స్ట్రాంగ్ ఉమెన్ అని, ఆమె  కెరీర్లో ఆమె ఎన్నో విమర్శలను ధైర్యంగా తిప్పికొట్టిందని, కొందరు చేసే ఇలాంటి కామెంట్స్ ఆమెను ఏ మాత్రం కృంగదీయలేవు అని సమంత సన్నిహితులు అంటున్నారు.