సినిమా వార్తలు

చైతూతో ఫ్రెండ్షిప్ సీక్రెట్ చెప్పిన శామ్


1 year ago చైతూతో ఫ్రెండ్షిప్ సీక్రెట్ చెప్పిన శామ్

అగ్రకథానాయికగా కొనసాగుతోన్న సమంత, తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ తాను సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది వివరించారు. "చెన్నై కాలేజ్ లో చదువుతూనే పాకెట్ మనీ కోసం నేను మోడలింగ్ చేసే దానిని. పై చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాలనేది నా కల. అయితే కొన్ని కారణాల వలన ఒక ఏడాది గ్యాప్ వచ్చింది. ఆ సమయంలోనే నేను సినిమాల్లోకి రావడం జరిగింది. తెలుగులో 'ఏ మాయ చేసావే' సినిమా చేస్తున్నప్పుడే నాగచైతన్యతో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. గౌతమ్ మీనన్ పెద్ద దర్శకుడు .. నాకేమో యాక్టింగ్ కొత్త .. తెలుగు రాదు. పైగా పెద్ద పెద్ద డైలాగ్స్ ఉండటంతో నాకు చాలా భయం వేసేసేది. ఆ సమయంలోనే నాకు చైతూతో మంచి స్నేహం ఏర్పడింది" అని చెప్పుకొచ్చింది. కాగా అందమైన మనసున్న సమంతకి మంచి పేరుంది. అయితే ఆమెకి కాస్త షార్ట్ టెంపర్ ఉందనేవారు కూడా లేకపోలేదు.

ఇదే విషయాన్ని గురించి ఆలీ ప్రస్తావించగా సమంత స్పందిస్తూ .. "ఈ మధ్యకాలంలో నేను మారిపోయాను. నా షార్ట్ టెంపర్ మొత్తాన్ని చైతూ తగ్గించేశాడు. నిజం చెబుతున్నాను ... ఇంట్లో అప్పర్ హ్యాండ్ ఆయనదే. బయట జనాలకి కనిపించేలా చైతూ ఇంట్లో వుండడు. ఇంట్లో పరిస్థితి రివర్స్ ఉంటుంది. బయట నేను ఎక్కువగా మాట్లాడేస్తూ అల్లరి చేస్తూ కనిపిస్తాను గానీ, ఇంట్లో మాత్రం చాలా సైలెంటే. ఆయన చాలా క్యూట్ గా ఉంటాడు కనుక, ఇంట్లో ఆయనను నేను 'బేబీ' అని పిలుస్తూ వుంటాను" అంటూ నవ్వుతూ సమంత తన పర్సనల్ విషయాలు పంచుకుంది.