సినిమా వార్తలు

తెలుగు 'స్త్రీ' మూవీలో సమంత - నిహారిక?


1 year ago తెలుగు 'స్త్రీ' మూవీలో సమంత - నిహారిక?

హిందీలో ఈ మధ్యకాలంలో వచ్చిన హారర్ మూవీస్ లో 'స్త్రీ' ఎంతో గుర్తింపు పొందింది. శ్రద్ధా కపూర్ కి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో శ్రద్ధా కపూర్ .. రాజ్ కుమార్ రావు నటించిన ఈ సినిమా, ఆగస్టు 31వ తేదీన విడుదలై 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ సినిమా నిర్మాతలు రాజ్ నిడిమోరు కృష్ణ డీకే తెలుగువ్యక్తే కావడం విశేషం. 15 కోట్లతో నిర్మించిన 'స్త్రీ' భారీస్థాయిలో లాభాలను తెచ్చిపెట్టడంతో, తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. నాయిక ప్రాధాన్యత కలిగిన ఈ సినిమా కథను సమంతకు, నిహారికకు వినిపించారట. 'యూటర్న్' ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టకపోవడంతో సమంత ఆలోచన చేస్తోందట. ఒకవేళ ఆమె చేయనంటే నిహారికతో చేయాలనే ఆలోచనలో నిర్మాతలు వున్నట్టుగా సమాచారం.