సినిమా వార్తలు

మన్మథుడు-2లో అనుష్క ప్లేస్ లో సమంతనా?


8 months ago మన్మథుడు-2లో అనుష్క ప్లేస్ లో సమంతనా?

అక్కినేని నాగార్జున కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో 'మన్మథుడు' ముందుగా వినిపిస్తుంటుంది. ఈ సినిమా నాగార్జున క్రేజ్ ను అమాంతం పెంచేసింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ గా 'మన్మథుడు 2' రూపొందనుంది. అన్నపూర్ణ బ్యానర్లో నిర్మితమవుతోన్న ఈ సినిమాకి, రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. మార్చి 12 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన భాగం షూటింగ్ యూరప్ లో జరగనుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో కథానాయికగా రకుల్ ఎంపిక జరిగిందంటున్నారు. ఆ తరువాత ఒక కీలకమైన పాత్రను అనుష్క చేయనుందనే వార్త వినిపించింది. అయితే తాజాగా సమంత పేరు తెరపైకి వచ్చింది. అనుష్క బదులుగా సమంతను తీసుకోనున్నారా? లేదంటే సమంత పోషించేది వేరే పాత్రనా? అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి వుంది.