సినిమా వార్తలు

శైలజారెడ్డి పాస్... యూటర్న్?


11 months ago శైలజారెడ్డి పాస్... యూటర్న్?

హీరో నాగచైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు, హీరోయిన్ సమంత నటించిన యూటర్న్ చిత్రాలు రెండోవారంలో బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయాయని సమాచారం. శైలజారెడ్డి అల్లుడు కలెక్షన్లు కొంతలో కొంత మంచి కలెక్షన్లను సాధించగా, యూటర్న్ వసూళ్లు చాలా దారుణంగా ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మారుతి దర్శకత్వంలో వచ్చిన శైలజారెడ్డి అల్లుడు రిలీజ్‌కు ముందే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో తొలివారం కలెక్షన్లు అదిరిపోయాయి.

తొలిసారి నాగచైతన్య కెరీర్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా శైలజారెడ్డి నిలిచింది.రెండోవారంలో శైలజారెడ్డి బాక్సాఫీస్ వద్ద తెలుగు రాష్ట్రాల్లో  రూ.3 కోట్లు కలెక్టు చేసింది. దాంతో ఈ సినిమా కలెక్షన్లు గత 11 రోజుల్లో రూ.26.50 కోట్లు వసూలు చేసిందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ చిత్ర థియేట్రికల్ హక్కులను రూ.18.40 కోట్లకు అమ్మారు. ఇప్పటి వరకు రూ.16.50 కోట్లు మాత్రమే వచ్చాయి. డిస్టిబ్యూటర్లు లాభాల్లోకి రావడానికి ఈ చిత్రం రూ.1.90 వసూలు చేయాల్సి ఉందని తెలుస్తోంది.

కాగా యూటర్న్ మూవీ చిత్ర కలెక్షన్లు నిరాశజనకంగానే ఉన్నాయని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రెండో వారంలో రూ.1.25 కోట్లు వసూలు చేసింది. గత 11 రోజుల్లో ఈ చిత్రం 7 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. నష్టాల్ల నుంచి బయటపడాలంటే యూటర్న్ చిత్ర థియేట్రికల్ హక్కులను రూ.8.8 కోట్లకు అమ్మారు. డిస్టిబ్యూటర్లు లాభాల్లోకి రావాలంటే సుమారు రూ.4.75 కోట్లు రావాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.