సినిమా వార్తలు

స‌హ‌జీవ‌నంపై సాయిప‌ల్ల‌వి షాకింగ్ కామెంట్స్‌


10 months ago స‌హ‌జీవ‌నంపై సాయిప‌ల్ల‌వి షాకింగ్ కామెంట్స్‌

ఒక అమ్మాయి ఒక అబ్బాయి వివాహం చేసుకోకుండా, సహజీవనం చేస్తే తప్పేమీ లేదని, అది వారిద్దరి మధ్యా ఉన్న అనుబంధం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయమని హీరోయిన్ సాయిపల్లవి పేర్కొంది. సాయిపల్లవి నటించిన 'మారి-2', 'పడిపడిలేచె మనసు' విడుదలతో సంతోషంగా ఉన్న ఆమె, మీడియాతో ఎదుట‌ ఈ వ్యాఖ్యలు చేసింది.  ఎవరినైనా ప్రేమిస్తున్నారా? ఎవరితోనైనా కలిసుంటున్నారా? లాంటి ప్రశ్నలు ఇటీవలి కాలంలో తనకు ఎక్కువయ్యాయని, తనకు లివింగ్ టుగెదర్ సంబంధం వద్దని, అంతమాత్రాన సహజీవనానికి వ్యతిరేకినని చెప్పన‌ని ఆమె అన్నారు. తాను వైవాహిక జీవితాన్నే కోరుకుంటున్నానని తేల్చిచెప్పారు. తాను చదువుకునే రోజుల్లో పుస్తకాలతో ప్రేమలో పడ్డానని, నటిగా మారాక నటనను ప్రేమిస్తున్నానని వివ‌రించింది.  కాగా, సాయిపల్లవి సూర్యతో కలసి నటించిన 'ఎన్జీకే' చిత్రం త్వరలో విడుదల కానుంది. ఇదే సమయంలో మలయాళంలో ఫాహత్ ఫాజిల్ పక్కన మరో సినిమాలో కూడా సాయిప‌ల్ల‌వి న‌టిస్తోంది.