సినిమా వార్తలు

‘నక్సలైట్’గా మారిపోయిన సాయి పల్లవి?


9 months ago ‘నక్సలైట్’గా మారిపోయిన సాయి పల్లవి?

‘నీది నాది ఒకే కథ' సినిమాతో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న దర్శకుడు వేణు ఉడుగుల తన తదుపరి సినిమా కోసం మరో ఆసక్తికర కథ తయారు చేసుకున్నాడట.  మొదటగా ఈ సినిమాకు హీరోగా శర్వానంద్ ను అనుకున్నారు. అయితేగానీ ఫైనల్ గా హీరో మారాడని సమాచారం. రానా దగ్గుబాటి ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. 'విరాటపర్వం 1992' అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ అని తెలుస్తోంది. 

ఈ సినిమాలో హీరో హీరోయిన్ పాత్రల గురించి మరో టాక్ వినిపిస్తోంది.  రానా ఈ సినిమాలో ఒక పోలీసు కానిస్టేబుల్ గా నటిస్తాడట. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపిస్తుందని, ఆమె  కానిస్టేబుల్ రానా లవ్ లో పడిపోతుందని అంటున్నారు. రానా ఇప్పటికే విభిన్నమైన కథలు, పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.  సాయి పల్లవి దీనినే ఫాలో అవుతోంది. వీరిద్దరూ కలిసి మొదటి సారి నటిస్తుండటంతో ఈ చిత్రంపై పలు అంచనాలు నెలకొంటున్నాయి.