సినిమా వార్తలు

ఆగస్టు 15 'సాహో విడుద‌ల‌


7 months ago ఆగస్టు 15 'సాహో విడుద‌ల‌

బాహుబ‌లి హీరో ప్రభాస్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'సాహో' సినిమా విడుద‌ల‌పైనే వుంది. ఈ సినిమా విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అంద‌రూ ఎంతో ఆత్రుత చూపిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కానుందనే దానిపై ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నార‌ని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే దిశగా వారు ఆలోచన చేస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సీన్లు వుండనున్నాయి. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, నీల్ నితిన్ ముఖేష్ .. అరుణ్ విజయ్ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. 'బాహుబలి 2' తరువాత ప్రభాస్ నుంచి వస్తోన్న సినిమా ఇదే కావడంతో, ఈ సినిమాపై భారీ అంచనాలు నెల‌కొన్నాయి.