సినిమా వార్తలు

'ఆర్ ఎక్స్ 100' మూవీ హీరో కొత్త సినిమా ప్రారంభం!


9 months ago 'ఆర్ ఎక్స్ 100' మూవీ హీరో కొత్త సినిమా ప్రారంభం!

ఇటీవలి కాలంలో యూత్ నుంచి అత్యధిక మార్కులు కొట్టేసిన చిత్రాలలో 'ఆర్ ఎక్స్ 100' ఒకటిగా నిలిచింది. ఈ సినిమాతో హీరోగా కార్తికేయ క్రేజ్ మరింతగా పెరిగింది. ఆయనతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు అమిత ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగు .. తమిళ భాషల్లో 'హిప్పీ' అనే సినిమా చేస్తున్నాడు కార్తికేయ. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే కార్తికేయ హీరోగా మరో సినిమా  పూజా కార్యక్రమాలు జరుపుకుంది. హైదరాబాద్ .. ఫిల్మ్ నగర్ టెంపుల్లో ఈ సినిమాను లాంచ్ చేశారు. బోయపాటి శ్రీను క్లాప్ ఇవ్వగా ముహూర్తపు సన్నివేశాన్ని హీరోపై చిత్రీకరించారు.

అనిల్ కడియాల, తిరుమల రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించే ఈ సినిమాకి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించనున్నాడు. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ సినిమా టైటిల్ తోపాటు మిగతా విషయాలను త్వరలోనే వెల్లడించనున్నారు.