సినిమా వార్తలు

‘ఆర్‌ఎక్స్ 100’ హీరో కొత్త సినిమా షురూ!


6 months ago ‘ఆర్‌ఎక్స్ 100’ హీరో కొత్త సినిమా షురూ!

కార్తికేయ హీరోగా వచ్చిన 'ఆర్ ఎక్స్ 100' భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఆయనకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఫలితంగా ఈ హీరోతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఉత్సాహాన్ని చూపుతున్నారు. తాజాగా ఆయన అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి అంగీకరించాడు. బోయపాటి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అర్జున్ జంధ్యాల, ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను ఒంగోలులో ప్లాన్ చేశారు. అక్కడ తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. సినిమా నిర్మాతలు అనిల్ కడియాల, తిరుమల రెడ్డి మాట్లాడుతూ, ‘వచ్చేనెల 8వ తేదీ వరకూ ఈ షెడ్యూల్ కొనసాగుతుందన్నారు. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతోపాటు, రెండు పాటలను కూడా ఇక్కడ చిత్రీకరించనున్నామని తెలిపారు. హీరోయిన్ ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలో అన్ని వివరాలు తెలియజేస్తామని తెలిపారు.