సినిమా వార్తలు

నానికి విలన్ గా 'ఆర్ ఎక్స్ 100' హీరో


3 months ago నానికి విలన్ గా 'ఆర్ ఎక్స్ 100' హీరో

నాని క్రికెటర్ గా నటిస్తున్న 'జెర్సీ' సినిమా ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా పనులు విడుదల దిశగా కొనసాగుతుండగానే, నాని తదుపరి సినిమా కోసం విక్రమ్ కుమార్ కి  గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమాలో నాని సరసన ఐదుగురు కథానాయికలు కనిపించనున్నట్టు వార్తలు వచ్చాయి. వాళ్లలో కీర్తి సురేశ్, మేఘ ఆకాశ్, ప్రియా వారియర్ పేర్లు  వినిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో విలన్ గా 'ఆర్ ఎక్స్ 100' హీరో కార్తికేయ చేయనున్నట్టుగా వార్తలు వినిపించాయి.  ఈ సినిమా లాంచ్ లో ఇది నిజమని స్పష్టమైంది. ఎందుకంటే ఈ సినిమా పూజా కార్యక్రమాలకు కార్తికేయ కూడా హాజరయ్యాడు. అలాగే నాని, విక్రమ్ కుమార్ కాంబినేషన్లో ఈ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. అయితే పైన పేర్కొన్న ముగ్గురు కథానాయికలు కాకుండా, పూజా కార్యక్రమాల్లో మరో కథానాయిక కూడా మెరిసింది. ఈ కొత్తమ్మాయి ఎవరనే విషయం వెల్లడికానుంది.