సినిమా వార్తలు

వసూళ్లు రూ.60 కోట్లు.. ‘పెనిమిటి’ పాటకు లెక్కలేనన్ని హిట్లు


11 months ago వసూళ్లు రూ.60 కోట్లు.. ‘పెనిమిటి’ పాటకు లెక్కలేనన్ని హిట్లు

త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం ప్రేక్షకుల అమితంగా ఆకట్టుకుంటోంది. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి, మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు దక్కుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్ల పరంగా విజయాన్ని అందుకుంటోంది. ఆంధ్ర - తెలంగాణ రాష్ట్రాల్లో తొలిరోజు వసూళ్ల విషయంలో ఈ సినిమా నాన్ 'బాహుబలి' రికార్డును అధిగమించిందని చెబుతున్నారు.

తొలి రోజున ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 5.73 కోట్లను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున 26.64 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 60 కోట్ల గ్రాస్ ను రాబట్టిందని సమాచారం. ఎన్టీఆర్ కెరియర్లో తొలి రోజు వసూళ్ల విషయంలో తొలి స్థానంలో ఈ సినిమా నిలవడం విశేషం. కథాకథనాల్లోని నూతనత్వం, సంగీతం, ఎన్టీఆర్ యాక్షన్, పూజా గ్లామర్ ఈ సినిమా హిట్ కి కారణమంటున్నారు. దీనికితోడు అరవింద సమేత వీర రాఘవ' సినిమాలో ప్రతిపాట మనసుకు హత్తుకుపోయేలానే ఉంటుంది.

వీటిలో రెండు పాటలు డాన్స్ లో ఎన్టీఆర్ సత్తా చాటిచెప్పేలా వున్నాయి. కష్టతరమైన స్టెప్స్ తో కూడిన డాన్స్ ను కూడా ఎన్టీఆర్ అదరగొట్టేశాడని అభిమానులు కితాబునిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సంగీతం పరంగా .. సాహిత్యం పరంగా 'పెనివిటి' పాట చెప్పుకోదగినదిగా నిలిచింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను కాలభైరవ చక్క్గగా పాడారు. భర్త రాకకోసం నిరీక్షిస్తూ, జ్ఞాపకాలను కూడగట్టుకుని భార్యపాడే ఈ మాట మనసును హత్తుకుంటోంది. అయితే ఈ పాటపై మరింత వర్కౌట్ చేసి వుంటే బాగుండేదనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.