సినిమా వార్తలు

తొమ్మిదేళ్లలో సమంత జీవితాన్నే మార్చేసిన ‘ఏమాయ చేశావే’


9 months ago తొమ్మిదేళ్లలో సమంత జీవితాన్నే మార్చేసిన ‘ఏమాయ చేశావే’

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై 9 సంవత్సరాలైంది. ఆమె నటించిన తొలి చిత్రం ఏ మాయ చేశావే ఫిబ్రవరి 26, 2010లో విడుదలైంది. ఈ సినిమాతోనే ఆమెకు నాగ చైతన్యతో పరిచయం ఏర్పడింది. తొలి సినిమాతోనే హిట్ దక్కించుకున్న సమంత.. ఆ తర్వాత వరుస విజయాలతో టాలీవుడ్ లో అగ్రహీరోయిన్ గా ఎదిగారు. అయితే ‘ఏమాయ చేశావే’ సినిమాకు సమంత సైన్ చేసేపుడు ఇది తన ప్రొఫెషనల్ లైఫ్ ను మాత్రమే కాదు, పర్సనల్ లైఫ్‌ను కూడా మార్చేస్తుందని ఊహించి ఉండకపోవచ్చు. 

చైతూతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, తరువాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత కలిసి నటిస్తున్న తొలి సినిమా ‘మజిలీ’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. . నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా ‘ఏ మాయ చేశావే’ నిర్మాత, మ‌హేష్ బాబు సోద‌రి మంజుల  ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ 'ఈ సినిమా విడుద‌లై తొమ్మిదేళ్లు అవుతోంది. అంతా నిన్ననే జ‌రిగిన‌ట్టుగా అనిపిస్తోంది. ఈ సినిమా కోసం ప‌నిచేసిన అంద‌రికీ చీర్స్ అని ట్వీట్ చేశారు. మంజుల చేసిన ట్వీట్‌పై సమంత స్పందిస్తూ.. `నా జీవితాన్ని మార్చేసే అవకాశం ఇచ్చినందుకు థాంక్స్` అంటూ సమాధానం ఇచ్చారు. అభిమానుల మద్దతు లేకపోతే నాకు ఈ స్థాన‌మే లేదు` అని స‌మంత‌ పేర్కొన్నారు.