సినిమా వార్తలు

200 కోట్ల క్లబ్‌లో ‘2.ఓ’


10 months ago 200 కోట్ల క్లబ్‌లో ‘2.ఓ’

‘2.ఓ’ ఊహించినట్టుగానే బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపేస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. రజనీకాంత్, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో రూపొందించిన ఈ చిత్రం విజువల్ వండర్‌గా తొలిరోజే పేరు సంపాదించింది. దీంతో తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.100 కోట్లు వసూలు చేసింది. ఒక్క హిందీ వర్షనే రూ.63.25 కోట్లు వసూలు చేసినట్టు తరుణ్ ఆదర్శ్ ప్రకటించారు. వీకెండ్ కూడా కావడంతో ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. రెండో రోజుతో పోల్చితే మూడో రోజు వసూళ్లు 23.46 శాతం పెరిగినట్టు తెలిపారు. రజనీకాంత్ మరో రికార్డ్ కూడా సాధించారు. ఆయన నటించిన రోబో, కబాలి చిత్రాలు కూడా రూ.200 కోట్లకు పైగా వసూలు చేశాయి. దక్షిణాదిలో రూ.200 కోట్లు రాబట్టిన మూడు సినిమాలున్న కథానాయకుడుగా రజనీ సరికొత్త రికార్డ్ తన సొంతం చసుకున్నారు.