సినిమా వార్తలు

‘వెన్నుపోటు’తో రచ్చచేస్తున్నవర్మ


9 months ago ‘వెన్నుపోటు’తో రచ్చచేస్తున్నవర్మ

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లోని ‘వెన్నుపోటు’ పాటపై ఆ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై టీడీపీ నేతలు మండిపడుతున్న విషయం విదితమే. వారిపై పరువు నష్టంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు టీడీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి చెప్పారు. దీనిపై స్పందించిన వర్మ... ‘వెన్నుపోటు’ పాటపై నిరసన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఎవరైతే ఫిర్యాదులు చేస్తున్నారో, దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారో వాళ్లందరికీ కృతఙ్ఞతలు. ఎందుకంటే, వాళ్లందరూ ‘వెన్నుపోటు’ వీక్షకుల సంఖ్యను మరింతగా పెంచుతున్నారు. అంటూ వర్మ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దివగత ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ఆయన కుమారుడు బాలకృష్ణ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలను నిర్మిస్తుంటే, మరోవైపు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో పోటీగా ఇంకో సినిమా తీస్తున్న విషయం విదితమే. ఈ సినిమాకు సంబంధించి ‘వెన్నుపోటు’ అనే పాటను వర్మ రిలీజ్ చేయడంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరోవైపు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో నిజాలు బయటకు వస్తాయని దివంగత ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి తెలిపారు. తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు అబద్ధాల సామ్రాజ్యాన్ని నిర్మించారని పెద్దఎత్తున విమర్శించారు. ఈ సినిమాతో వైస్రాయ్ హోటల్ ఉదంతం అంతా బయటకు వస్తుందనే ఆశాభావంతో ఆమె ఉన్నారు. పైగా ‘వెన్నుపోటు’పాటను చూసి చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.